తెలంగాణ

telangana

ETV Bharat / state

అంగన్​వాడీ రూపురేఖలను మార్చబోతున్నాం: ఏపీ సీఎం జగన్ - ys jagan latest news

నవంబర్ రెండో వారం నుంచి ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో ప్రీప్రైమరీ పాఠశాలలను ప్రారంభించాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కొత్తగా 27 వేల 438 అంగన్​వాడీ భవనాల నిర్మాణం చేపట్టాలని జగన్ ఆదేశించారు. అంగన్​వాడీల రూపురేఖలను మార్చబోతున్నట్లు తెలిపిన సీఎం... పిల్లలకు అత్యుత్తమ విధానాల్లో బోధన జరిపేలా చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.

we-are-going-to-change-the-face-of-anganwadis-jagan
అంగన్వాడీల రూపురేఖలను మార్చబోతున్నాం: ఏపీ సీఎం జగన్

By

Published : Sep 9, 2020, 8:32 PM IST

అంగన్​వాడీ కేంద్రాల్లో నాడు-నేడు, వైఎస్సార్‌ ప్రీప్రైమరీ స్కూళ్లపై ఏపీ ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి సమీక్షించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేశ్, సీఎస్‌ నీలం సాహ్ని, ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంగన్​వాడీ కేంద్రాల్లో నాడు-నేడు కార్యక్రమం అమలు తీరుపై సీఎం జగన్ వివరాలు తెలుసుకున్నారు. అంగన్​వాడీల రూపురేఖలు పూర్తిగా మార్చబోతున్నామన్న ఆ రాష్ట్ర సీఎం జగన్... నిర్మాణం, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని ఆదేశించారు.

సమీక్ష నిర్వహిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి

కిండర్‌ గార్టెన్‌ స్కూల్స్‌లో ఉన్న పాఠ్య ప్రణాళికను అధ్యయనం చేసి అక్కడ అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు ఇక్కడ ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. అంగన్​వాడీలలో నాడు-నేడు కార్యక్రమంలో మరుగుదొడ్లు, తాగునీరు, చిన్నాపెద్ద మరమ్మతులు, విద్యుద్దీకరణ, కిచెన్, రిఫ్రిజిరేటర్, ఫర్నీచర్, గ్రీన్‌ చాక్‌ బోర్డు, 55 అంగుళాల టీవీ, గోడలపై పెయింటింగ్స్‌తో పాటు, క్రీడా స్థలం ఉండేలా మార్పులు చేసినట్లు ఏపీ ముఖ్యమంత్రి తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న అడ్వైజరీ కమిటీ, కరికులమ్‌ కమిటీలు.. ఫుడ్, శానిటేషన్, బాత్రూమ్స్‌పై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

అంగన్​వాడీ టీచర్స్‌ ట్రైనింగ్‌ విషయంలో పక్కాగా ఉండాలని, మరింత ఛాలెంజింగ్‌గా ఉండాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. కొత్తగా 27,438 భవనాల నిర్మాణం చేపట్టాల్సి ఉందన్న సీఎం... తొలి దశలో 17,984, రెండో దశలో 9454 కేంద్రాల నిర్మాణం చేయాలని సూచించారు. తొలి దశ పనులు ఈ ఏడాది డిసెంబరులో మొదలుపెట్టాలని, రెండో దశ పనులు వచ్చే ఏడాది నవంబరు 14న మొదలు పెట్టాలని యోచిస్తున్నట్లు తెలిపారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ఈనెల 30వ తేదీ నాటికి స్థలాలు గుర్తింపు పూర్తి చేయాలని, ఆ తర్వాత అంగన్​వాడీ అభివృద్ధి కమిటీల ఏర్పాటు, మెటీరియల్‌ సేకరణ, ఇతర పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఈ ఏడాది డిసెంబరు 1న పనులు మొదలుపెట్టి, వచ్చే ఏడాది జూన్‌ 30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులకు సూచించారు. అంగన్​వాడీ వర్కర్లు, హెల్పర్లు, మహిళా శక్తి కేంద్రాల సూపర్‌వైజర్లు ఆంగ్లంలో మాట్లాడటానికి సాధన కోసం మొబైల్‌ యాప్‌ రూపొందించాలని ఆదేశించారు. నవంబరు రెండోవారం నుంచి ప్రీప్రైమరీ-1, ప్రీ ప్రైమరీ-2 పాఠశాలలు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఏపీ ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ఆదేశించారు.

ఇదీ చదవండీ... అనంతపురం - న్యూదిల్లీ మధ్య కిసాన్ రైలు ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details