విదేశాల నుంచి ఇటీవల హైదరాబాద్ నగరానికి వచ్చిన వారి వివరాలను, ఆరోగ్యస్థితిని అధికార బృందాలు ఇంటింటికి తిరిగి వాకబు చేస్తున్నాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం నాటికి సుమారు 5 వేల మంది హోం క్వారంటైన్ అయినట్లు తెలిసిందన్నారు.
ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నాం - ghmc
ఇతర దేశాల నుంచి హైదరాబాద్ నగరానికి ఇటీవల వచ్చిన వారి వివరాలను అధికార బృందాలు ఇంటింటికి వెళ్లి సేకరిస్తున్నాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. ఇవాళ పూర్తి నివేదిక అందుతుందన్నారు.
ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నాం
నిబంధనలు అతిక్రమించిన 10 మందిని ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలించామన్నారు. మరో 2300 మంది వివరాలు అందుతున్నాయని వెల్లడించారు. సమగ్ర నివేదిక ఈరోజు రూపొందుతుందని చెప్పారు.
ఇదీ చూడండి :కవరేజ్ కోసం వచ్చిన రిపోర్టర్‌పై పోలీసుల దాడి