తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త చట్టానికి ఓకే.. మా పాత్ర ఏమిటో చెప్పండి : వీఆర్వో సంఘం

హైదరాబాద్ లక్డీకాపూల్​లోని వాసవి భవన్​లో గ్రామ రెవెన్యూ అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలపై సంఘం నేతలు సమావేశమయ్యారు. గత కొద్ది రోజులుగా వీఆర్వోల విషయంలో అనేక కథనాలు వస్తున్నాయని వీఆర్వీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ సతీష్ ఆందోళన వ్యక్తం చేశారు.

కొత్త చట్టానికి ఓకే.. మా పాత్ర ఏమిటో చెప్పండి : వీఆర్వో సంఘం
కొత్త చట్టానికి ఓకే.. మా పాత్ర ఏమిటో చెప్పండి : వీఆర్వో సంఘం

By

Published : Sep 6, 2020, 7:37 PM IST

హైదరాబాద్ లక్డీకాపూల్​లోని వాసవి భవన్​లో గ్రామ రెవెన్యూ అధికారుల సమస్యలపై వీఆర్​ఓ సంఘం నేతలు సమావేశం నిర్వహించారు. గత కొంత కాలంగా వీఆర్వోలకు సంబంధించి అనేక కథనాలు వస్తున్నాయని వీఆర్వీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ సతీష్ ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త రెవెన్యూ చట్టం రాబోతోందని.. అది ఎలా ఉండబోతోందనేది మాత్రం తెలియదని సతీష్ పేర్కొన్నారు. వీఆర్వోలుగా అనేక మంచి పనులు చేశామని... ఇప్పుడు తమ ఉద్యోగాలు ఉంటాయో లేదో తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు.

మా కష్టాన్ని గుర్తించట్లేదు...

తమ కష్టాల్ని గుర్తించకుండా ఇతర శాఖలకు బదిలీ చేస్తున్నారని వాపోయారు. ఇప్పటికే చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడుతున్నట్లు వ్యాఖ్యానించారు. వీఆర్వోల అధికారాలు తీయొద్దని.. తమపై అవినీతి ఆరోపణలు మోపి ఇతర శాఖలకు పంపటం సమంజసం కాదని ప్రభుత్వాన్ని కోరారు.

100రోజుల్లో చేశాం కాబట్టే..

భూ రికార్డుల ప్రక్షాళన 100 రోజుల్లో సమర్థంగా చేశామని.. ఫలితంగా అన్నదాతలు రైతు బంధు పథకం పొందగలుగుతున్నారని వివరించారు. రెవెన్యూ విషయంలో తమ పరిధిలోకి వచ్చిన సమస్యలపై మాత్రమే ప్రాథమిక విచారణ చేస్తున్నామని స్పష్టం చేశారు.

కొత్త చట్టానికి ఓకే.. మా పాత్ర ఏమిటో చెప్పండి : వీఆర్వో సంఘం

ఇవీ చూడండి : రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు అక్కడక్కడా వర్షాలు

ABOUT THE AUTHOR

...view details