SRISAILAM: శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే నిండుకుండలా మారడంతో.. ఎగువ నుంచి వచ్చే వరదను దిగువకు వదులుతున్నారు. జలాశయంలోని ఒక గేటును 10 అడుగుల మేర పైకెత్తి 27వేల 662 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
నిండుకుండలా శ్రీశైలం.. గేటు ఎత్తి దిగువకు నీటి విడుదల - ఏపీ ముఖ్యవార్తలు
SRISAILAM: ఎగువ నుంచి వరద పోటెత్తడంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. దీంతో ఒక గేటును పైకెత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. శ్రీశైల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.10 అడుగులుగా ఉంది.
నిండుకుండలా శ్రీశైలం
జూరాల, సుంకేసుల నుంచి లక్షా 96వేల 244 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి వస్తోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.10 అడుగులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 216 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 210 టీఎంసీల నిల్వ ఉంది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 89,336 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
ఇవీ చదవండి: