కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు కృష్ణానదిలో వరద పరుగులెడుతోంది. నిన్న ఉదయానికి 98,879 క్యూసెక్కుల ప్రవాహం ఆలమట్టికి చేరుకుంది. గడిచిన 24 గంటల సమయంలో 8.54 టీఎంసీల జలాలు ప్రాజెక్టులోకి చేరాయి. ఈ నెల రెండో తేదీ నుంచే కొద్దికొద్దిగా ప్రారంభమైన వరద ఇప్పుడు భారీగా పెరిగింది. ప్రస్తుతం ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఇంజినీర్లు చెబుతున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 519.60 అడుగులకు గానూ ప్రస్తుతం 512.70 అడుగుల వద్ద ఉండగా 33.19 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మరోవైపు కృష్ణాకు ఉపనది తుంగభద్ర జలాశయానికి 15,891 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. కర్ణాటకలోని అన్ని ప్రాజెక్టులకు ప్రవాహం వచ్చి చేరుతోంది.
ఆలమట్టికి కృష్ణమ్మ పరుగులు - WATER_REACH_ALMATTI
కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు కృష్ణానదిలో వరద ఉరకలెత్తుతోంది. మంగళవారం ఉదయానికి 98,879 క్యూసెక్కుల ప్రవాహం ఆలమట్టికి చేరుకుంది.
ఆలమట్టికి కృష్ణమ్మ పరుగులు