తెలంగాణ

telangana

ETV Bharat / state

హిమాయత్ సాగర్​లో పెరుగుతున్న నీటిమట్టం - నిండుకుండలా మారిన హిమాయత్ సాగర్

జంట నగరాలకు తాగునీటిని అందించే హిమాయత్ సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది. జలాశయంలో ఇంకో 3.5 అడుగుల నీరు చేరితే నిండుకుండలా మారనుంది. ఈ నేపథ్యంలో అధికారులు గేట్లు ఎత్తే అవకాశం ఉంది.

హిమాయత్ సాగర్ లో పెరుగుతున్న నీటిమట్టం
హిమాయత్ సాగర్​లో పెరుగుతున్న నీటిమట్టం

By

Published : Sep 29, 2020, 8:22 AM IST

హైదరాబాద్ జంట నగరాలకు తాగునీటిని అందించే హిమాయత్ జలాశయంలో నీటి నిల్వలు క్రమేణా పెరుగుతున్నాయి. శివారు ప్రాంతాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. హిమాయత్ సాగర్​లో నీటిమట్టం 1,763.5 అడుగులుగా ఉంది. ఇంకా 3.5 అడుగులు అయితే జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉంది.

ప్రాజెక్టు గేట్లు ఎత్తే పరిస్థితి ఉన్న నేపథ్యంలో మూసీనది పరివాహక ప్రాంతాల్లోని 100 కుటుంబాలను అధికారులు ఇతర ప్రాంతాలకు తరలించారు.

ఇదీ చూడండి: 'హేమంత్ హత్యోదంతం: 21కి పెరిగిన నిందితుల సంఖ్య'

ABOUT THE AUTHOR

...view details