హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని బాబానగర్, అల్ జుబైల్ కాలనీ, గాజి మిల్లట్ కాలనీలల్లో వరద నీరు భారీగా చేరింది. నగర శివారు బాలాపూర్ చెరువు నుంచి వరద ప్రవాహం బాబానగర్‌కు చేరుకోవడం వల్ల ఇళ్లలోకి నీరు చేరుకున్నాయి, వీధుల్లో వాహనాలు కొట్టుకుపోయాయి.ఆ ప్రాంతంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వారిని మొదటి ఫ్లోర్‌కు వెళ్లాలని కార్పొరేటర్ నీటితో తిరుగుతూ హెచ్చరించారు.
చంద్రాయణగుట్టలో పలు కాలనీల్లోకి మళ్లీ చేరిన వర్షపు నీరు - చంద్రాయణగుట్టలో కాలనీల్లోకి చేరిన నీరు
భాగ్యనగరంలో శనివారం కురిసిన వర్షానికి చంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని పలు కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నవారు.. మొదట్ ఫ్లోర్‌లోకి వెళ్లాలని స్థానిక కార్పొరేటర్ ప్రజలను హెచ్చరించారు.
చంద్రాయణగుట్టలో పలు కాలనీల్లోకి మళ్లీ చేరిన వర్షపు నీరు
గత కొద్ది రోజుల క్రితం భారీ వర్షాల వల్ల వచ్చిన వరదల నుంచి కోలుకోకముందే మళ్లీ కాలనీలు జలదిగ్బంధంలోకి వెళ్లడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం ధాటికి కాలనీకి ఆనుకుని ఉన్న ఫలక్‌నుమా ఓవర్ బ్రిడ్జిపై ఏర్పడిన ఆరు ఫీట్ల గుంత పడింది. వీటికి వీలైనంత త్వరగా మరమ్మతులు చేపట్టాలని కాలనీవాసులు అధికారులను కోరుతున్నారు.
ఇదీ చదవండిఃవరదతో ట్రాఫిక్ జామ్.. ఈత కొట్టుకుంటూ వెళ్లిన వ్యక్తి..