గ్యాస్స్టేషన్లోకి నీరు.. ఇబ్బందుల్లో వాహనదారులు - గ్యాస్స్టేషన్లోకి నీరు.. ఇబ్బందుల్లో వాహనదారులు
హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షానికి తాడ్బండ్ వద్దనున్న గ్యాస్ స్టేషన్లోకి భారీగా వరదనీరు చేరుకోగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
బంగాళాఖాతం ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో సోమవారం కురిసిన వర్షానికి తాడ్బండ్ వద్దనున్న గ్యాస్స్టేషన్లోకి వరదనీరు చేరింది. రహదారిపై నీరు పూర్తిగా నిలిచిపోయినందున పక్కనే ఉన్న గ్యాస్స్టేషన్లోకి వరదనీరు ప్రవేశించడం వల్ల వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక నీరు ఎక్కడపడితే అక్కడ నిలిచిపోయి పరిస్థితి దారుణంగా మారింది. సాయంత్రం పూట ఇంటికి వెళ్తున్న విద్యార్థులకు, ఉద్యోగులకు ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది.
TAGGED:
water in gas station