భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో గోదావరి వరద నీటి ప్రవాహానికి 200 ఎకరాల్లో పంటపొలాలు నీట మునిగాయి. అన్నారం, కమలాపూరం, చినరాయిగూడెం గ్రామాలకు గోదావరి వరద నీరు పోటెత్తింది. వరద నీటిలో వరి, పత్తి చేలు పూర్తిగా నీట మునిగాయి.
భారీ వర్షం.. అన్నదాతల ఆశలన్నీ నీటిమయం - మణుగూరులో గోదారమ్మ ప్రవాహానికి నీట మునిగిన పంటపొలాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో గోదావరి వరద నీటి ప్రవాహానికి 200 ఎకరాల్లో పంటపొలాలు నీట మునిగాయి. పలు చోట్ల వరద నీరు ముంచెత్తగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మణుగూరులో గోదారమ్మ ప్రవాహానికి నీట మునిగిన పంటపొలాలు
కమలాపురం- అన్నారం గ్రామాల మధ్య ఉన్న రహదారిపైకి వరదనీరు ప్రవహిస్తుండగా రాకపోకలు నిలిచాయి. పేరంటాల చెరువులోని వరద నీరు పగిడేరు- సాంబాయిగూడెం రహదారిపై ప్రవహించగా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి. వరద నీరు ముంచెత్తగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి :గోదారమ్మ ఉగ్రరూపం... భద్రాద్రిలో మొదటి ప్రమాద హెచ్చరిక
TAGGED:
Pillalu meeda munaka