కర్ణాటకతో పాటు కృష్ణా పరీవాహకంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద నీటి ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టు నుంచి 78,899 క్యూసెక్కులు, హంద్రీనీవా నుంచి 1100 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 820.20 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 40.9904 టీఎంసీలుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే పది రోజుల్లో జలాశయం నిండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇన్ఫ్లో ఇలాగే ఉంటే పదిరోజుల్లో శ్రీశైలం నిండుతుంది..! - శ్రీశైళం ప్రాజెక్టు వార్తలు
ఏపీలోని కర్నూల్ జిల్లా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, హంద్రీ నుంచి 79,999 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం
Last Updated : Jul 16, 2020, 10:30 AM IST