హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్) చుట్టూ పల్లెలకు ఇక నుంచి రోజు విడిచి రోజు తాగునీరు సరఫరా చేయనున్నారు. ప్రస్తుతం ఇస్తున్న నీళ్ల కంటే నిత్యం 50 మిలియన్ లీటర్లు అదనంగా అందించనున్నారు. గురువారం ఓఆర్‌ఆర్ ట్రాన్స్‌మిషన్ అధికారులతో జలమండలి ఎండీ దానకిషోర్ సమావేశమయ్యారు. సంబంధిత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జీహెచ్‌ఎంసీతో పాటు ఓఆర్‌ఆర్ చుట్టూ ఉన్న 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 17 పంచాయతీలకు సంబంధించి 193 గ్రామాలకు జలమండలే తాగునీటిని అందిస్తోంది.
రోజు విడిచి రోజు నీరు.. నేటి నుంచి సరఫరా - తెలంగాణ వార్తలు
హైదరాబాద్ ఓఆర్‌ఆర్ చుట్టూ ఉన్న గ్రామాల్లో రోజు విడిచి రోజు తాగు నీరు సరఫరా చేయనున్నారు. చాలా చోట్ల 3-5 రోజులకొకసారి మాత్రమే నీటిని అందిస్తున్నారు. శివార్లలో నీటి కొరత వల్ల చాలా మంది సొంత బోర్లపై ఆధారపడుతున్నారు. ఇక నుంచి అలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టాలని జలమండలి నిర్ణయించింది.
చాలా చోట్ల 3-5 రోజులకొకసారి మాత్రమే నీటిని అందిస్తున్నారు. అదే సమయంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రం రోజు విడిచి రోజు సరఫరా చేస్తున్నారు. శివార్లలో నీటి కొరత వల్ల చాలా మంది సొంత బోర్లపై ఆధారపడుతున్నారు. వేసవిలో బోర్లు ఎండిపోయి ట్యాంకర్లను తెప్పించుకుంటున్నారు. ఇక నుంచి అలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టాలని జలమండలి నిర్ణయించింది. జంట జలాశయాలతో పాటు నాగార్జునసాగర్, గోదావరి, మంజీరా, సింగూరు ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీళ్లు ఉండటంతో తక్షణం శివార్లకు సరఫరా పెంచనుంది. ఫలితంగా ఓఆర్‌ఆర్ చుట్టూ ఉన్న 50 వేల కుటుంబాలకు మేలు జరగనుందని ఎండీ దానకిషోర్ తెలిపారు. శుక్రవారం నుంచే అదనపు సరఫరా ప్రారంభించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు..
ఇదీ చదవండి:నీటి ట్యాంకులో చిన్నారి మృతదేహం.. మేనమామ, అత్తలే హంతకులా?