తెలంగాణ

telangana

ETV Bharat / state

'మ్యాన్​ హోల్స్ సమస్యలు ఎప్పటికప్పడే పరిష్కరించండి' - జలమండలి వార్తలు

జలమండలి అధికారులతో జలమండలి ఎండీ దాన కిషోర్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా మంచినీటి నాణ్యత పరీక్షలు రెట్టింపు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

water-board-md-dana-kishore-teleconference-with-officials
'మ్యాన్​ హోల్స్ ఓవర్​ ఫ్లో సమస్యలు ఎప్పటికప్పడే పరిష్కరించండి'

By

Published : Oct 18, 2020, 5:20 PM IST

వర్షాల నేపథ్యంలో సేవరేజ్ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జలమండలి ఎండీ దానకిశోర్ అధికారులను ఆదేశించారు. జలమండలి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన... రహదారులపై మ్యాన్‌ హోల్స్‌ ఓవర్ ఫ్లో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.

అత్యవసర పరిస్థితుల్లో కూడా సేవలు అందించే విధంగా 700 మందిని నియమించుకోవడానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. కలుషిత నీటితో ప్రజలు ఇబ్బంది పడకుండా మంచినీటి నాణ్యత పరీక్షలు రెట్టింపు చేసినట్లు తెలిపారు.

కలుషిత నీరు ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాలకు నీటి ట్యాంకర్‌ల ద్వారా సరఫరా చేయాలని సూచించారు. పునరావాస ప్రాంతాల్లో వాటర్ పాకెట్స్ ద్వారా తాగునీరు అందించాలని సూచించారు.

ఇదీ చూడండి:'రేపు అల్పపీడనం... రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు'

ABOUT THE AUTHOR

...view details