తెలంగాణ

telangana

ETV Bharat / state

రెవెన్యూపై దృష్టి పెట్టిన జలమండలి

జలమండలి మంచినీటిని సరఫరా చేస్తున్న వాణిజ్య, బల్క్​ కనెక్షన్లకు వందశాతం బిల్లులు వసూలు చేయాలని ఎండీ దానకిశోర్​ అధికారులను ఆదేశించారు. అలాగే నీటి వృథాను అరికట్టేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

రెవెన్యూపై దృష్టి పెట్టిన జలమండలి

By

Published : Aug 29, 2019, 4:49 AM IST

రెవెన్యూపై దృష్టి పెట్టిన జలమండలి

రెవెన్యూ పెంచేదిశగా చర్యలు చేపట్టాలని జలమండలి ఎండీ దానకిషోర్ అధికారులను ఆదేశించారు. ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జలమండలి మంచినీటిని సరఫరా చేస్తున్న వాణిజ్య, బల్క్ కనెక్షన్లకు వంద శాతం బిల్లింగ్, బిల్లులు వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. కనెక్షన్లకు ఇప్పటి వరకు బిల్లులు జారీ చేయకున్నా.... వారు బిల్లులు కట్టకున్నా సంబంధిత మేనేజర్​పై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు ఎండీ హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో బిల్లింగ్, బిల్లుల వసూలులో లైన్​మెన్, మీటర్ రీడర్లు కీలకంగా వ్యవహరించేలా చూడాలన్నారు. అలాగే నీటి వృథాను ఆరికట్టేందుకు వినియోగదారులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

అక్రమ కనెక్షన్లపై నిఘా..

ఇటీవల కాలంలో 138 అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించి.. సంబంధిత భవన యాజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. వీరి నుంచి జరిమానాల రూపంలో రూ. 2 కోట్ల వరకు ఆదాయం సమకూరిందని వివరించారు. డివిజన్​కు ఇద్దరు కానిస్టేబుళ్లు అక్రమ నల్లా కనెక్షన్లను గుర్తించేందుకు ఇంటింటికి తిరిగి నల్లా కనెక్షన్లను తనిఖీలు చేస్తారన్నారు. అలాగే ప్రధాన కార్యాలయం స్థాయిలో ముగ్గురు జీఎంలు, ఆరుగురు మేనేజర్లతో కలిసి ఐదు ఇంజనీరింగ్ విజిలెన్స్ టీంలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వీరు సైతం అక్రమ నల్లా కనెక్షన్లను గుర్తిస్తారని తెలిపారు. వీరు అక్రమ నల్లా కనెక్షన్లను గుర్తించడం, అలాగే డొమెస్టిక్ కనెక్షన్ అనుమతి తీసుకుని వాణిజ్య అవసరాలకు జలమండలి నల్లా కనెక్షన్లను వినియోగిస్తున్న వారిని గుర్తించడం కోసం బృందాలు పనిచేస్తాయని వివరించారు.

ఇవీ చూడండి: కాళేశ్వరానికి కలెక్టర్లు... ఉత్సాహంగా స్వీయ చిత్రాలు

ABOUT THE AUTHOR

...view details