హైదరాబాద్ నగరంలో దుర్గం చెరువు తీగల వంతెన త్వరలో అందుబాటులోకి రానుండటం వల్ల చెరువులోకి మురుగు నీరు కలవకుండా జలమండలి ఏర్పాట్లు చేస్తోంది. దుర్గం చెరువు దగ్గర ఉన్న జలమండలి మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఎండీ దాన కిశోర్ సందర్శించారు. దేశంలో ఏ నగరమైనా మురుగులో 20 నుంచి 30 శాతం మాత్రమే శుద్ధి చేస్తుండగా.... జలమండలి మాత్రం సుమారు 43 శాతానికిపైగా శుద్ధి చేస్తున్నట్లు ఎండీ తెలిపారు. ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు చెరువులోకి మురుగు నీరు వదలకుండా 24 గంటలు నలుగురితో గస్తీ కోసం ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.
మురుగు నీరు వదలకుండా 24 గంటలు గస్తీ ఉండాలి: దాన కిశోర్
దుర్గం చెరువు దగ్గర ఉన్న జలమండలి మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఎండీ దాన కిశోర్ సందర్శించారు. దేశంలో ఏ నగరమైనా మురుగులో 20 నుంచి 30 శాతం మాత్రమే శుద్ధి చేస్తుండగా.... జలమండలి మాత్రం సుమారు 43 శాతానికిపైగా శుద్ధి చేస్తున్నట్లు ఎండీ తెలిపారు. ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులు చెరువులోకి మురుగు నీరు వదలకుండా 24 గంటలు నలుగురితో గస్తీ కోసం ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.
అలాగే ఎస్టీపీలో శుద్ధి చేసిన నీటిని, చెరువులోని నీటిని ప్రతి నాలుగు గంటలకొసారి పరీక్షించడానికి వేర్వేరుగా రెండు థర్డ్ పార్టీ తనిఖీ చేసి రిపోర్ట్ సమర్పించాలని అధికారులకు దాన కిశోర్ సూచించారు. ఎవరైనా చెరువులోకి నేరుగా మురుగు వదిలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రియాక్టర్ల వద్ద పేరుకు పోయిన మట్టిని ఎప్పటికప్పుడు తొలగించి, పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. ఎస్టీపీల్లో ఇన్ లెట్, అవుట్ లెట్తోపాటు నలువైపులా అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, మొత్తం ఎస్టీపీ పర్యవేక్షణ ఆన్లైన్లో చేయడానికి ఏర్పాట్లు చేయాలని దాన కిశోర్ ఆదేశించారు.