రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ కోసం ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఈ సీజన్‌లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రానున్నట్లు అంచనా వేసిన సర్కార్... కొనుగోలు కోసం 6 వేల కేంద్రాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా గిడ్డంగుల సంస్థతో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీల నిర్వహణలో ఉన్న 281 గోదాముల్లో... 61 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉండేలా సిద్ధం చేసింది.
'ధాన్యం నిల్వకు ముందస్తు జాగ్రత్తలు' - Warehousing chairman on paddy storage
ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు ముందస్తు జాగ్రత్తలన్నింటినీ తీసుకున్నామని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ సామెల్ తెలిపారు. ఈ సీజన్‌లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రానున్నట్లు అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు.

'ధాన్యం నిల్వకు ముందస్తు జాగ్రత్తలు'
నియంత్రిత సాగు దృష్ట్యా గణనీయంగా సాగు పెరిగినందున... ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు ముందస్తు జాగ్రత్తలన్నింటినీ తీసుకున్నామంటున్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ సామెల్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
'ధాన్యం నిల్వకు ముందస్తు జాగ్రత్తలు'
ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ చట్టసవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం