జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగియటంతో అభ్యర్థులు ప్రచారంపై దృష్టి సారించారు. సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట్ తెరాస అభ్యర్థి హేమలత తరఫున డివిజన్ ఇంఛార్జ్ ఎంపీ పసునూరి దయాకర్ ప్రచారం నిర్వహించారు. పద్మారావునగర్‌లో ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు గులాబీ పార్టీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు తెరాసదే: ఎంపీ పసునూరి దయాకర్ - బన్సీలాల్‌పేట్ తెరాస అభ్యర్థి హేమలత తాజా వార్తలు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు తెరాసదేనని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట్ తెరాస అభ్యర్థి హేమలత తరఫున పద్మారావునగర్‌లో ప్రచారం నిర్వహించారు.
![జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు తెరాసదే: ఎంపీ పసునూరి దయాకర్ warangal mp pasunuri dayakar campaign in ghmc elections](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9616853-thumbnail-3x2-trs.jpg)
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు తెరాసదే: ఎంపీ పసునూరి దయాకర్
బస్తీల్లో ప్రజలు తెరాసకు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. మరోసారి కారు గుర్తుకు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అటు రాంగోపాల్‌పేట్ డివిజన్ తెరాస అభ్యర్థి అత్తిలి అరుణ కాచిబౌలి, వెంగల్‌రావునగర్‌లో ప్రచారం చేశారు. డివిజన్ పరిధిలోని అనేక సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు తెరాసదే: ఎంపీ పసునూరి దయాకర్