కరోనాను నివారించడానికి ప్రభుత్వం లాక్డౌన్ విధించడం వల్ల హైదరాబాద్-వరంగల్ రహదారిని మూసివేశారు. అత్యవసర పని నిమిత్తం నల్గొండ, యాదాద్రి భువనగిరి, వరంగల్ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు.
హైదరాబాద్-వరంగల్ రహదారి మూసివేత - coronavirus news
హైదరాబాద్-వరంగల్ రహదారిని లాక్డౌన్ కారణంగా మూసివేశారు. అత్యవసర పనుల నిత్తమం వస్తున్న వారిని మాత్రమే అనుమతిస్తున్నారు.
![హైదరాబాద్-వరంగల్ రహదారి మూసివేత warangal hyderabad highway closed](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6528821-thumbnail-3x2-dsgsg.jpg)
హైదరాబాద్-వరంగల్ రహదారి మూసివేత
ఘట్‌కేసర్ వద్ద పోలీసులు ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. అనవసరంగా వచ్చిన వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. వారి వాహనాలను స్టేషన్‌కు తరలిస్తున్నారు. పోలీసు పికెట్‌ను మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి పరిశీలించారు. అవసరం లేకుండా వాహనాలతో రోడ్ల మీదికు వస్తే సీజ్ చేస్తామనిహెచ్చరించారు.
హైదరాబాద్-వరంగల్ రహదారి మూసివేత
ఇదీ చూడండి:మా ఊరికి మీరు రావొద్దు... మీ ఊరికి మేమురాము