తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రీతి కేసు.. సైఫ్‌కు నాలుగు రోజుల కస్టడీ - Medical student Preeti Updates

Medical student Preeti Updates: పీజీ వైద్య విద్యార్థిని ప్రీతీ ఆత్మహత్య కేసులో నిందితుడైనా సైఫ్‌ను పోలీసులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. దీనికి వరంగల్ కోర్టు నాలుగు రోజుల కస్టడీకి అనుమతినిస్తూ పేర్కొంది.

Warangal
ప్రీతి కేసు.. సైఫ్‌కు నాలుగు రోజుల కస్టడీ

By

Published : Mar 1, 2023, 8:30 PM IST

Medical student Preeti Updates: పీజీ వైద్య విద్యార్థిని ప్రీతీ ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో.. సీనియర్ ర్యాగింగ్ వేధింపుల కారణంగానే ప్రీతి సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితుడు సైఫ్‌కు పోలీసు కస్టడీ ఇవ్వాలని కోర్టును కోరింది. సైఫ్‌ను 4 రోజుల కస్టడీకి పోలీసులు కోరగా.. వరంగల్ కోర్టు దీనికి అనుమతినిచ్చింది.

Medical student Preeti Suicide ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడిన ప్రీతి.. చివరకు ఆదివారం కన్నుమూసింది. జనగామ జిల్లాకు చెందిన ప్రీతి పీజీ చదువుకునేందుకు హాస్టల్‌లో ఉండేది. వైద్యవిద్యను అభ్యసిస్తున్న ప్రీతి పట్ల సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ మొదటి నుంచి కోపాన్ని ప్రదర్శించేవాడని తెలుస్తోంది. గతేడాది నవంబర్‌లో కళాశాలలో చేరిన నాటి నుంచి నిందితుడు సైఫ్‌తో ప్రీతికి రోజూ ఇబ్బందులేనని సమాచారం. డిసెంబర్ 6న రోగికి అవసరమైన ఊపిరి తీసుకునే పైప్ ఎందుకు తీసుకురాలేందంటూ ప్రశ్నించడంతో... ప్రీతి ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. తండ్రికి చెప్పగా.. ఆయన ఏసీపీ దృష్టికి తీసుకువెళ్లారని తెలుస్తోంది. ఇక గ్రూపుల్లో ఎలాంటి సందేశాలు పెట్టొద్దని కళాశాల ప్రిన్సిపల్, హెచ్‌వోడీ సైఫ్‌ని హెచ్చరించినా తీరు మారలేదని తెలుస్తోంది.

ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటల సమయంలో ఆపరేషన్ థియేటర్ పక్క గదిలో అపస్మారక స్ధితిలో పడి ఉన్న ప్రీతిని చూసి అక్కడి సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారు హుటాహుటిన వచ్చి సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం దగ్గలేదు. ఐదురోజులుగా మృత్యువుతో పోరాడి.. ప్రీతి చివరకు కన్నుమూసింది.

ఇక ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపగా... పోలీసులు సవాల్‌గా తీసుకుని కేసును విచారించారు. ఈ కేసులో వాట్సాప్ సంభాషణలు కీలకంగా మారాయన్నారు. ప్రీతిని లక్ష్యంగా చేసుకునే సైఫ్ వేధింపులకు గురి చేశాడని పోలీసు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. ప్రీతి ఆత్మహత్యకు కారణమైన సైఫ్‌ను అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించగా... ఎస్సీ, ఎస్టీ అట్రాసిటితో పాటు ర్యాగింగ్ యాక్ట్, ఆత్మహత్య కేసులు నమోదు చేశారు. ప్రిన్సిపల్‌, హెచ్​వోడీ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి.

అయితే తాజాగా నిందితుడు సైఫ్‌కు కస్టడీ ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరింది. సైఫ్‌ను 4 రోజుల కస్టడీకి పోలీసులు కోరగా.. వరంగల్ కోర్టు దీనికి అనుమతినిచ్చింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details