తెలంగాణ

telangana

ETV Bharat / state

YCP vs JanaSena: జనసేన - వైకాపాల మాటల యుద్ధం.. అసలేం జరుగుతోంది..! - Janasena VS YCP

ఏపీలో రాజకీయ వేడి బలంగా వీస్తోంది. జనసేన - వైకాపా (YCP vs JanaSena) మధ్య విమర్శలు.. ప్రతివిమర్శల దాడి పతాక స్థాయికి చేరుకుంది. ట్వీట్లు... రీట్వీట్లు.. వ్యాఖ్యలు.. కౌంటర్లతో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. ఓ పక్షం నుంచి కౌంటర్ పడిందో లేదో... సెకన్లలోనే మరోపక్షం నుంచి వందల సంఖ్యలో తిరుగు సమాధానాలు వచ్చేస్తున్నాయి. ఏ మాత్రం వెనక్కి తగ్గేదిలేదంటూ ఢీ అంటే ఢీ అనే పరిస్థితి నెలకొంది. ఒక్కమాటలో చెప్పాలంటే గులాబ్​ తుపాన్ తీవ్రత కంటే.. సామాజిక మాధ్యమాల్లో ఇరు పక్షాలు పోస్టులు వరద ప్రవాహన్ని తలపిస్తున్నాయి. ఆన్​లైన్​ సినిమా టిక్కెట్ల వివాదం చినికి చినికి గాలి వానగా మారి.. మరో ఎపిసోడ్ దిశగా వెళ్తున్నట్లు కనిపిస్తోంది. తాజా వివాదంలోకి సామాజిక, వ్యక్తిగత అంశాలను కూడా చొప్పిస్తూ.. వాతావరణాన్ని ఆయా పార్టీల నేతలు వేడెక్కించారు. రోడ్ల విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ 'శ్రమదానం' కార్యక్రమానికి సిద్ధమయ్యారు పవన్. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు రాష్ట్ర పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేపట్టడం అనివార్యమైంది. ఫలితంగా తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల్లో పవన్ పర్యటనపై అందరీ దృష్టి కేంద్రీకృతమైంది.

YCP vs JanaSena
మాటల యుద్ధం

By

Published : Sep 29, 2021, 8:48 AM IST

ఆంధ్రప్రదేశ్​లో వైకాపా.. జనసేనల (YCP vs JanaSena) మాటల యుద్ధం.. తీవ్ర స్థాయికి చేరుకుంది. వైకాపా ప్రభుత్వంపై పవన్ (Janasena chief Pawan Kalyan) వ్యాఖ్యలను ఖండిస్తూ మంత్రులు ఘాటుగా బదులిచ్చారు. అదే సమయంలోనే.. సినీ నటుడు పోసానీ మురళీకృష్ణ హైదరాబాద్​లో ప్రెస్ మీట్​తో సడెన్ ఎంట్రీ ఇచ్చారు. గంటకుపైగా మాట్లాడిన ఆయన.. పవన్ ​(Janasena chief Pawan Kalyan)పై విమర్శల వర్షం గుప్పిస్తూనే.. ప్రశ్నలను సంధించారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో.. జనసేన శ్రేణులు కుతకుత ఉడికిపోయాయి. సోషల్​ మీడియాలో విమర్శల వర్షం గుప్పించాయి. ఇంతలోనే పవన్ (Janasena chief Pawan Kalyan) మరోసారి వైకాపా ప్రభుత్వంపై ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 'గ్రామ సింహాలు ఎంట్రీ' ఇచ్చాయంటూ... సెటైర్లు వేశారు. జనసేన అభిమానులు.. తన కుటుంబసభ్యులను టార్గెట్ చేస్తూ... వేల సందేశాలు పంపారంటూ పోసాని మరోసారి మంగళవారం ప్రెస్​మీట్ పెట్టారు. వ్యక్తిగతంగా కక్షకట్టి.. తన కుటుంబాన్ని వివాదంలోకి లాగొద్దని కోరారు. అక్కడే పోసానిపై పవన్ (Janasena chief Pawan Kalyan) అభిమానులు దాడికి యత్నించటంతో.. తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోసానిని పోలీసు వాహనంలోనే పోలీసులు ఇంటికి చేర్చారు. పవన్​ అభిమానుల (Janasena chief Pawan Kalyan Fans) నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పోసాని తెలిపారు.

పవన్ ట్వీట్లు.. సజ్జల కౌంటర్

పవన్ కల్యాణ్​ ఒక ట్వీట్​ ద్వారా వైకాపా ప్రభుత్వం (YCP vs JanaSena)పై ఘాటు విమర్శలు చేశారు. "వైకాపా ప్రభుత్వ 'పాలసీ ఉగ్రవాదం' కి అన్ని రంగాలు, అన్ని వర్గాలు నాశనం అయిపోతున్నాయి. దీనిని ఎదుర్కోవలసిన సమయం ఆసన్నమయిందని.. పోస్ట్ చేశారు. పవన్ కల్యాణ్ (Janasena chief Pawan Kalyan) చేసిన విమర్శలపై.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Government Adviser Sajjala Ramakrishna Reddy) ఘాటుగా స్పందించారు. పవన్‌ గురించి సినీ పరిశ్రమలోనే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. సినీ పరిశ్రమకు మంచి చేయాలని చూస్తున్నామని.. బురద చల్లాలని చూస్తే పవన్‌ కల్యాణ్​ (Janasena chief Pawan Kalyan)కే ఇబ్బందిగా మారుతుందని వ్యాఖ్యలు చేశారు.

తాజా వివాదంపై పలు రాజకీయ పక్షాలు స్పందించాయి. పవన్‌కల్యాణ్‌పై వైకాపా నాయకుల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు భాజపా రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు (BJP Rajya Sabha member GVL Narasimha Rao News) తెలిపారు. తిట్ల తుపానుకు తెరదించి గులాబ్‌ తుపానుపై వైకాపా శ్రద్ధ పెట్టాలని హితవు పలికారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్(Janasena chief Pawan Kalyan)కు రైతుల ఉద్యమాలు కనిపించడం లేదా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ(cpi ramkrishna news) ప్రశ్నించారు. మంత్రులు, వైకాపా నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్​ (AP CM Jagan)కి కులపిచ్చి లేదని ఎవరైనా కాదనగలరా అని ప్రశ్నించారు.

సోషల్ మీడియాలో రచ్చ రచ్చ...

వైకాపా.. జనసేన మాటల యుద్ధంపై సామాజిక మాధ్యమాల్లోనూ రచ్చ రచ్చ జరుగుతోంది. జనసేన అభిమానులు.. పలు అంశాలను ప్రస్తావిస్తూ.. అధికార వైకాపాపై సెటైర్లు, పంచ్​లు విసురుతున్నారు. ఇందుకు బదులుగా వైకాపా అభిమానులు కూడా.. ఘాటుగా బదులిస్తున్నారు. పవనే టార్గెట్​గా పోస్టుల వర్షం కురిపిస్తున్నారు. పలు యాశ్​ ట్యాగ్​లతో... పోస్టుల యుద్ధం చేస్తున్నారు. ఇరు పార్టీలకు మద్దతుగా క్రియేట్ చేసిన గ్రూపులన్నీ... ఈ వివాదానికి సంబంధించిన పోస్టులతోనే నిండిపోయాయి.

ఆన్​లైన్​లో టిక్కెట్ల అంశంతోనే జనసేన.. వైకాపాల మధ్య ఈ మాటల యుద్ధం మొదలైంది. కానీ ఏ అంశంతో వివాదం మొదలయ్యిందో... ఆ విషయంపై పెద్దగా చర్చ జరగకపోవటం గమనార్హం. సామాజిక, వ్యక్తిగత అంశాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. విమర్శలు చేసుకుంటున్న తీరుతో టిక్కెట్ వార్ కాస్త.. మరో మలుపు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది.

ఇదీ చదవండి:Perni Nani on Online Tickets: 'నిర్దేశించిన రేట్లకే ఆన్​లైన్​లో సినిమా టికెట్లు.. త్వరలోనే అమలు'

Movie Tickets: విక్రయంపై విమర్శలు.. తదుపరి చర్యల్లో ప్రభుత్వం!

ABOUT THE AUTHOR

...view details