వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ సలీమ్ తెలిపారు. వక్ఫ్ బోర్డు భూముల పరిరక్షణ తదితర అంశాలపై హైదరాబాద్ నాంపల్లిలో సమావేశం నిర్వహించారు. సభ్యుల సూచనలతో ఛైర్మన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మైనారిటీ శ్మశాన వాటికల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని...అలా చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
'వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ కోసం పటిష్ఠ చర్యలు' - తెలంగాణ వార్తలు
వక్ఫ్‌బోర్డు ఆస్తుల పరిరక్షణ కోసం పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు బోర్డు ఛైర్మన్ సలీమ్ తెలిపారు. ఎవరైనా కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణపై సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
వక్ఫ్ బోర్డు ఆస్తులపై సమావేశం, వక్ఫ్ బోర్డు కీలక నిర్ణయాలు
వక్ఫ్ బోర్డ్ సంబంధించిన ఆస్తులను ఎవరైనా కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బోర్డు ఆస్తులను కాపాడడానికి టాస్క్ ఫోర్స్ ఇంఛార్జీగా డీఎస్పీ ఖాజా మొయినుద్దీన్‌ని నియమించినట్లు పేర్కొన్నారు. ఎవరైనా పెద్దవారు మృతి చెందితే అంత్యక్రియలకు రూ.5,000 అందజేస్తామన్నారు. అందుకు హెల్ప్ లైన్ నంబర్ 7995560136 ను సంప్రదించాలని సూచించారు.
ఇదీ చదవండి:పదో రోజు పకడ్బందీగా ఆంక్షలు.. ఉల్లంఘించిన వారిపై చర్యలు