దేశంలో ఎక్కడా లేని విధంగా మైనార్టీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ సలీం అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని హాజ్ హౌస్‌లో రంజాన్ కానుకగా... నిత్యావసర సరకుల కిట్లను జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి అందజేశారు.
కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ముస్లిం భౌతిక దూరాన్ని పాటిస్తూ... ప్రార్థనలలో పాల్గొనాలని సూచించారు. మహమ్మరి కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.