సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్ మణికంఠ కాలనీలో తల్లీకుమారులకు త్రుటిలో ప్రమాదం తప్పింది. సాయంత్రం వేళ ఈదురుగాలులకు ఓ భవంతి గోడ కూలి పక్కనే ఉన్న రేకుల ఇంటిపై పడింది. ఇంట్లో ఉన్న తల్లీ కుమారుడు స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడ్డాయి.
ఇంటిపై కూలిన పక్కింటి గోడ.. - secundrabad news
రేకుల ఇంటిపై పక్కింటి గోడ కూలింది. ఇంట్లోనే తల్లీ, కుమారుడు ఉన్నారు. అదృష్టవశాత్తు వారిద్దరూ స్వల్ప గాయాలతో బయట పడ్డారు. మణికంఠ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రేకుల ఇంటిపై కూలిన గోడ.. తల్లీ కుమారులకు స్వల్పగాయాలు