హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లో ప్రహారి గోడ నేలమట్టమైంది. ధ్వంసమైన శకలాలు రహదారిని కప్పేయడం వల్ల ఆ రోడ్డుపై రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు.
బంజారాహిల్స్‌లో కూలిన గోడ... నిలిచిన రాకపోకలు - బంజారాహిల్స్‌లో కూలిన గోడ
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బంజారాహిల్స్‌లోని ఓ ప్రహారి గోడ నేలమట్టమైంది. ధ్వంసమైన శకలాలు రోడ్డుపై పడడం వల్ల తాత్కాలికంగా రాకపోకలను అధికారులు నిలిపివేశారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
బంజారాహిల్స్‌లో కూలిన గోడ... నిలిచిన రాకపోకలు
త్వరలోనే రోడ్డుపై ఉన్న చెట్లను తొలగిస్తామని అధికారులు పేర్కొన్నారు. కూలిన గోడ ఓ సాఫ్ట్ వేర్ అధినేతకు చెందిన ఇంటి ప్రహారిగా తెలుస్తోంది.