తిరుమల శ్రీవారికి ఐదు బ్యాటరీ వాహనాలు విరాళంగా అందాయి. వేలూరుకు చెందిన వీఎస్‌ఎల్ ఇండస్ట్రీస్, ఆకెళ్ల రాఘవేంద్ర ఫౌండేషన్ సంయుక్తంగా రూ. 15 లక్షల విలువైన వాహనాలను అందించాయి.
తిరుమలకు ఐదు బ్యాటరీ వాహనాలు విరాళం - ap news
ఏపీలోని వేలూరుకు చెందిన వీఎస్‌ఎల్ ఇండస్ట్రీస్, ఆకెళ్ల రాఘవేంద్ర ఫౌండేషన్ సంయుక్తంగా రూ. 15 లక్షల విలువైన ఐదు బ్యాటరీ వాహనాలను తిరుమల శ్రీవారికి విరాళంగా ఇచ్చారు. క్రిమి సంహారక రసాయనాలను పిచికారీ చేసేలా, చెత్తను తరలించేందుకు వీలుగా ఈ వాహనాలు ఉపయోగపడతాయని తెలిపారు.
తిరుమలకు ఐదు బ్యాటరీ వాహనాలు విరాళం
బ్యాటరీతో నడిచే ఈ వాహనాలను క్రిమిసంహారక రసాయనాలను పిచికారీ చేసేలా, చెత్తను తరలించేలా రూపొందించారు. వాహనాలకు పూజలు నిర్వహించిన అనంతరం తితిదే అధికారులకు తాళాలు అందజేశారు.
ఇవీ చదవండి:పల్లే వేదికగా.. సామాజిక సమస్యలే కథాంశంగా సాగిపోతున్న "మై విలేజ్ షో"