తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐదు నెలలుగా మానసిక క్షోభకు గురవుతున్నాం : వీఆర్వోల సంఘం

రాష్ట్రంలో వీఆర్వోల పోస్టులను రద్దు చేసి ఐదు నెలలవుతున్నా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ సతీశ్‌ ఆరోపించారు. దీని వల్ల తాము మానసిక క్షోభకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మూసారాంబాగ్‌లోని రెవెన్యూభవన్‌లో రాష్ట్రస్థాయి వీఆర్వోల ఆత్మగౌరవ సమావేశం నిర్వహించారు.

By

Published : Jan 24, 2021, 10:23 PM IST

vros state level meeting on their problems in moosarambagh revenue bhavan in hyderabad today
వీఆర్వోల ఆత్మగౌరవసభలో మాట్లాడుతున్న సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్‌

రాష్ట్రంలోని అన్ని శాఖల ఉద్యోగులకు పదోన్నతులు ఇస్తూ వీఆర్వోలను మాత్రం వివక్షకు గురి చేస్తున్నారని రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ సతీశ్‌ ఆరోపించారు. వీఆర్వోల పోస్టులు రద్దు చేసి ఐదు నెలలు దాటినా ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం రాకపోవడం బాధాకర విషయమన్నారు. దీని వల్ల తాము ఎంతో మానసిక క్షోభ అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మూసారాంబాగ్‌లోని రెవెన్యూ భవన్‌లో రాష్ట్ర స్థాయి గ్రామ రెవెన్యూ అధికారుల ఆత్మగౌరవ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై సంఘం నేతలు చర్చించారు. రాష్ట్రంలో ఐదువేల మంది వీఆర్వోల ఆత్మ గోస సతీశ్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ పెద్దలను ఎన్నోసార్లు కలిసినప్పటికీ ఇంత వరకు ఎలాంటి హామీ రాలేదని తెలిపారు. రెవెన్యూ శాఖ ఒక కుటుంబమని తమకు జరుగుతున్న అన్యాయంపై తహసీల్దార్లు స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తమలో చాలా మంది వయసు పైబడి బీపీ, షుగర్లతో అనారోగ్యాల పాలవుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ నిర్ణయాన్ని మళ్ళీ ఒకసారి పునరాలోచించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి :తహసీల్దార్‌ కార్యాలయాల్లో పని విభజన చేయాలి: కిషన్‌రెడ్డి

ABOUT THE AUTHOR

...view details