తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త రెవిన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నాం: వీఆర్​ఏ అసోసియేషన్​

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న కొత్త రెవిన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నట్టు డెరెక్ట్​ రిక్రూట్​మెంట్​ విలేజ్​ రెవిన్యూ అసిస్టెంట్స్​ అసోసియేషన్​ పేర్కొంది. నేరుగా రిక్రూట్​ అయిన వీఆర్​ఏలను క్రమబద్ధీకరించాలని వీఆర్​ఏ అసోసియేషన్​ విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్​లోని బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అసోసియేషన్​ సమావేశమయింది.

VRA Association Meeting In Sundariah Vignana Kendram
కొత్త రెవిన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నాం: వీఆర్వో అసోసియేషన్​

By

Published : Sep 5, 2020, 7:55 PM IST

Updated : Sep 5, 2020, 10:58 PM IST

హైదరాబాద్​ బాగ్​లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డైరెక్ట్​ రిక్రూట్​మెంట్​ విలేజ్​ రెవిన్యూ అసోసియేషన్​ సమావేశమైంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టనున్న నూతన రెవిన్యూ చట్టాన్ని స్వాగతిస్తున్నట్టు సంఘం గౌరవాధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్​ అన్నారు. డైరెక్ట్​ రిక్రూట్​మెంట్​ వీఆర్​ఏలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సుధీర్ఘ కాలంగా విధులు నిర్వహిస్తున్న డైరెక్ట్​ రిక్రూట్​మెంట్​ వీఆర్ఏలను రెగ్యులర్​ చేయాలని అసోసియేషన్​ మహిళా విభాగం అధ్యక్షురాలు బాలమణి కోరారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయని, కొత్త రెవెన్యూ చట్టం కూడా విజయవంతమవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వీఆర్ఏలను రెగ్యులర్​ చేసి.. ఏ విభాగానికి బదిలీ చేసినా బాధ్యతగా విధులు నిర్వహిస్తామని ఆమె తెలిపారు.

Last Updated : Sep 5, 2020, 10:58 PM IST

ABOUT THE AUTHOR

...view details