Voting Percentage Increased in Villages :రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోలాహలం సందడిగా సాగుతోంది. ప్రజాస్వామ్యంలో కీలకమైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్దసంఖ్యలో గ్రామీణ ఓటర్లు ఆసక్తి చూపారు. ఓటు చైతన్యంతో ప్రతి ఒక్కరూ తమ హక్కును(Right to Vote) వినియోగించుకుంటున్నారు. ఒకే విడతలో 119 నియోజకవర్గాలకుగాను ఉదయాన్నే ప్రారంభమైన ఓటింగ్.. తొలిత మందకొడిగా సాగినప్పటికీ మధ్యాహ్న సమయంలో అనూహ్యంగా అత్యధిక స్థాయికి చేరుకుంది.
ఎన్నికల్లో వెల్లివిరిసిన ఓటరు చైతన్యం - మధ్యాహ్నం తరువాత పోలింగ్ కేంద్రాల వద్ద పెరిగిన రద్దీ
పట్టణాలకు ధీటుగా పల్లెల్లో పోలింగ్ వెల్లువెత్తింది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పోటెత్తటంతో అత్యధిక ఓటింగ్ శాతం నమోదవ్వటంతో.. పోలింగ్ కేంద్రాలు వద్ద ఓటర్లు బారులు తీరారు. పట్టణాల నుంచి పల్లెలకు చేరుకున్న గ్రామీణ ఓటర్లతో ఉన్నట్టుండి పోలింగ్ కేంద్రాలు(Polling Booth) కిటకిటలాడాయి. ఓవైపు రాష్ట్రం నుంచి వలస వెళ్లిన ఓటర్లు రాక.. మరోవైపు కెరటంలా వెలిసిన యువ ఓటర్లతో ఓటింగ్ ఊపందనుకుందనే చెప్పవచ్చు. ఇవన్నీ ఒకఎత్తైతే.. అత్యధిక వయస్కులు, దివ్యాంగులు సైతం ఉల్లాసంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపారు.
సిరా చుక్క వేలికి కాదు కాలికి - అంగవైకల్యమున్నా ఓటేసిన దివ్యాంగులు
Rural Areas Record Higher Polling :ఈ సందర్భంగా పలు పల్లెల్లో ఓటర్ల రద్దీతో పోలింగ్ కేంద్రాలు.. పండగ వాతావరణాన్ని తలపించాయి. ఈ క్రమంలోనే పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గానికి చెందిన 96 యేళ్ల దేవెళ్ల రత్నమ్మ తన ఓటును వేసి ఓటర్లకు ఆదర్శంగా(Ideally) నిలిచారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామంలో 102 ఏళ్ల కస్తూరమ్మ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఎన్నికలలో క్రమం తప్పుకండా తాను ఓటు హక్కు వినియోగించుకున్నానని తెలిపారు.