తెలంగాణ

telangana

ETV Bharat / state

జియాగూడలో ఓట్ల గల్లంతు.. ఆందోళనలో ఓటర్లు - జీహెచ్​ఎంసీ ఎన్నికలు

గ్రేటర్​ ఎన్నికల్లో ఓట్ల గల్లంతు ఓటర్లలో గందరగోళం సృష్టిస్తోంది. జియాగూడలోని బూత్​ నంబర్​ 36, 37, 38 లలో ఏకంగా మూడువేల ఓట్లు గల్లంతయ్యాయి. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

votes missing in jiyaguda division
జియాగూడలో ఓట్ల గల్లంతు.. ఆందోళనలో ఓటర్లు

By

Published : Dec 1, 2020, 3:59 PM IST

జీహెచ్​ఎంసీ పరిధిలోని జియాగూడలో ఓట్లు గల్లంతయ్యాయి. బూత్ నెంబర్ 36, 37, 38లలో అధిక సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సుమారు మూడు వేల ఓట్లు గల్లంతవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస, ఎంఐఎం పార్టీలతో అధికారులు కుమ్మక్కై ఓట్లను డిలీట్ చేయించారని స్థానికులు ఆరోపించారు.

సమాచారం అందుకున్న జోనల్ కమిషనర్.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులు తమ ఓట్ల గురించి ఆమెను ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు.

జియాగూడలో ఓట్ల గల్లంతు.. ఆందోళనలో ఓటర్లు

ఇదీ చదవండి:ఒక్క ఓటే కదా.. అని వదలొద్దు! ఓటేద్దాం రండి!!

ABOUT THE AUTHOR

...view details