తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓట్లు గల్లంతయ్యాయని బాధితుల ఆందోళన - జీహెచ్‌ఎంసీ లేటెస్ట్ న్యూస్

జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమ ఓట్లు గల్లంతయ్యాయని కొందరు ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముప్పై ఏళ్ల నుంచి ఓటేస్తున్నా... తమ ఓట్లు ఎలా పోయాయని ప్రశ్నిస్తున్నారు.

voters protest for were lost votes in ghmc
ఓట్లు గల్లంతయ్యాయని బాధితుల ఆందోళన

By

Published : Dec 1, 2020, 10:34 AM IST

ఓట్లు గల్లంతయ్యాయని చాంద్రాయణగుట్ట, ఇంద్రానగర్‌ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక డివిజన్ ఓట్లు మరో డివిజన్‌లో చేర్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఓట్లు ఎక్కడా లేవని కొందరు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత ఇళ్లు ఉన్నా ఓట్లు ఎలా పోయాయని ప్రశ్నిస్తున్నారు.

ముప్పై ఏళ్ల నుంచి ఓటేస్తున్నామని... ఇప్పుడు ఓటు లేదని చెబుతున్నారని వాపోయారు. ఇంట్లో 21 ఓట్లు ఉంటే 19 ఓట్లు లేవని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:ఓటు వేసే వారికే నిలదీసే హక్కు ఉంటుంది : కేటీఆర్​

ABOUT THE AUTHOR

...view details