గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తార్నాక డివిజన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెరాస అభ్యర్థి మోతే శ్రీలత రెడ్డికి మద్దతుగా తార్నాక డివిజన్ మాణికేశ్వర్ నగర్లో ప్రచారం చేస్తున్న డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు చేదు అనుభవం ఎదురైంది. వరదలు వచ్చినప్పుడు రాని నేతలు... ఇప్పుడెందుకు వచ్చారని ఉప సభాపతి పద్మారావును బస్తీవాసులు నిలదీశారు.
తార్నాకలో ఉద్రిక్తత... డిప్యూటి స్పీకర్‌కు చేదు అనుభవం - జీహెచ్ఎంసీ ఎన్నికలు 2020
బల్దియాలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల వల్ల కొన్ని చోట్ల నేతలకు చేదు అనుభవాలు ఎదురువుతున్నాయి. తార్నాక డివిజన్లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన డిప్యూటి స్పీకర్ పద్మారావును స్థానిక మహిళలు నిలదీశారు.
తార్నాకలో ఉద్రిక్తత... డిప్యూటి స్పీకర్‌కు చేదు అనుభవం
ఓట్ల కోసం బస్తీల్లోకి వస్తారు కానీ తమ సమస్యలు ఏనాడు పట్టించుకోలేదని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడైనా తమ సమస్యలు పరిష్కరిస్తారా లేదా అంటూ ప్రశ్నించారు. మహిళలకు ఎంత సర్ది చెప్పినా వినకపోవడంతో... చివరకు పద్మారావు వెనుదిరిగారు.
ఇదీ చదవండి:అక్బరుద్దీన్ వ్యాఖ్యలను ఖండించిన కేటీఆర్
Last Updated : Nov 25, 2020, 5:28 PM IST