రాష్ట్రంలోని 33 జిల్లాల ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు. 2020 జనవరి ఒకటో తేదీ ప్రాతిపదికన ముసాయిదా జాబితా ప్రకటించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వెబ్ సైట్ అయిన www.ceotelangana.nic.inలో శాసనసభ నియోజకవర్గాల, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితా పొందుపరిచారు. ముసాయిదా జాబితాపై వచ్చే నెల 15 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు.
ఫిబ్రవరి 7న ఓటర్ల తుది జాబితా
అభ్యంతరాలను జనవరి 27న పరిష్కరించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 7న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. ఓటరు జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియ కూడా పూర్తైంది. 105 కొత్త పోలింగ్ కేంద్రాలు సహా రాష్ట్రంలో 34,707 పోలింగ్ కేంద్రాలున్నాయి.