డిజిటల్ పద్ధతిలో ఓటరు గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఓటరు గుర్తింపు కార్డును తమ మొబైల్ ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకొనే విధానాన్ని భారత ఎన్నికల సంఘం నేటి నుంచి ప్రారంభించనుంది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు.
ఓటర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ల ద్వారా పీడీఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకొని కంప్యూటర్ల ద్వారా ప్రింట్ తీసుకుని వడంతో పాటు మొబైల్లోనూ ఎపిక్ కార్డును భద్రపరచుకోవచ్చు. కొత్తగా నమోదైన యువ ఓటర్లు నేటి నుంచి నెలాఖరు వరకు ముందుగా తాము రిజిస్టర్ చేసుకున్న మొబైల్ ఫోన్ల ద్వారా ఈ- ఎపిక్ కార్డులు డౌన్ లోడ్ చేసుకొనేందుకు అవకాశం కల్పించారు.