Voter Enrollment in Telangana 2023 : ఓటు హక్కు దేశ ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు. ఇది దేశ భవిష్యత్తును మార్చే అస్త్రం. భారత రాజ్యాంగం కల్పించిన ఈ హక్కు ద్వారా.. ప్రభుత్వాలు, పాలకులను ఎన్నుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. పాలకులు ఎంపికలో ప్రతి ఓటు కీలకమే.. నేను ఓటు వేయకపోతే ఏమీ కాదులే అనుకోకండి. ఆ ఒక్క ఓటే మన ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆ ఒక్క ఓటే దేశ ప్రజల భవిష్యత్తును ప్రభావితం చేసే.. నాయకుణ్ని ఎన్నుకుంటుంది.
Youth Voter Enrollment in Telangana 2023 :ఎన్నికల సంఘం.. రాష్ట్రంలోశాసనసభ ఎన్నికలకు పచ్చజెండా ఊపింది. ఎలక్షన్ల నిర్వహణకు అధికార యంత్రాంగం విస్తృతంగా కసరత్తు చేస్తోంది. మరోవైపు ఓటర్ల నమోదు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై ఎన్నికల సంఘం నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో కొత్త ఓటరు నమోదుకు ఈసీ అవకాశం కల్పించింది. ఇప్పటి వరకు ఓటరు జాబితాలో నమోదు చేసుకోని వారు.. ఇప్పుడు ఓటు హక్కును పొందవచ్చు.
Telangana Assembly Elections 2023 :రాష్ట్రంలో రాబోయే ఎన్నికలకు యువ ఓటర్లకు ఇదే చివరి అవకాశం. అసెంబ్లీ ఎన్నికల్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటేయాలనే సంకల్పంతో భారత ఎన్నికల సంఘం ఈ అవకాశమిచ్చింది. ఈనెల అక్టోబరు 31వ తేదీలోగా ఆన్‌లైన్‌లో కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ప్రస్తుతం యువ ఓటర్లు.. ఓటరు నమోదుపై ఆసక్తి చూపుతున్నారు.