EC Focus on Voter Awareness Programs Telangana రానున్న శాసనసభ ఎన్నికల సన్నద్ధతపై ఈసీ ముమ్మర కసరత్తులు Voter Awareness Telangana 2023 :రానున్న ఎన్నికల్లో ఓటింగ్ శాతం మరింత పెంచేందుకు వ్యూహాత్మక ప్రణాళిక అవసరమని, యువత భారీగా ఓటర్లుగా నమోదుకావాల్సి ఉందని.. కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ మనోజ్ సాహూ అన్నారు. శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది.
EC Focus on Voter Awareness Campaign Telangana 2023 : సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ, డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ మనోజ్ సాహూ, అధికారులతో కూడిన బృందం ఎన్నికల సన్నద్దత, ఇతర అంశాలపై రాష్ట్ర అధికారులతో చర్చిస్తున్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్(CEO Vikash Raj)తో కలిసి ఈసీ ప్రతినిధులు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో సమావేశమయ్యారు. ఎన్నికల సన్నద్ధత, ఏర్పాట్లు, ఇతర అంశాలపై సీఎస్‌తో చర్చించారు.
Telangana Assembly Elections 2023 : శాసనసభ ఎన్నికల కసరత్తు వేగవంతం.. ఆ విషయాలపై ఈసీ ఆరా
Election Affidavit Tampering Case Minister Srinivas :ఇదే సమయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్ కేసు అంశంపైనా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఉన్నపాటుగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ పైనే కేసు నమోదైంది. ఈ అంశాన్ని ఈసీ తీవ్రంగా పరిగణిస్తోంది. సీఈఓ వికాస్‌రాజ్‌ను దిల్లీ పిలిపించుకొని సంప్రదింపులు జరిపింది. తాజాగా హైదరాబాద్ వచ్చిన ఈసీ ప్రతినిధులు ఈ విషయమై రాష్ట్ర అధికారులతో చర్చిస్తున్నారు. న్యాయవాదులతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోనూ ఈ విషయమై ఈసీ బృందం చర్చించినట్లు తెలిసింది.
పోలీసుల అధికారుల బదిలీలపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈసీ ఇప్పటికే సీఎస్‌ను వివరణ కోరింది. అన్ని అంశాలపైనా సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. ఈసీ ప్రతినిధుల సమావేశం అనంతరం పోలీసు, ఇతర ఉన్నతాధికారులతో సీఎస్ సమావేశమయ్యారు. ఓటరు అవగాహన కార్యక్రమాలపై ఈసీ ప్రతినిధులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. గత శాసనసభ ఎన్నికలతో(Telangana Assembly Election 2023) పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదైన విషయాన్ని ఈసీ గమనంలోకి తీసుకొంది.
ఈసీ నియామకాల కొత్త బిల్లులో ట్విస్ట్.. ప్రధాని నేతృత్వంలోని కమిటీకి 'సూపర్ పవర్'!
పోలింగ్ శాతం వీలైనంత ఎక్కువగా నమోదయ్యేలా తీసుకోవల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఓటరు అవగాహనా కార్యక్రమాలను పర్యవేక్షించే స్వీప్ నోడల్ అధికారులతో ఈసీ బృందం సమావేశమైంది. ఇవాళ సమావేశం కొనసాగనుంది. రాజస్థాన్ ఎన్నికల ప్రధాన అధికారి ప్రవీణ్ గుప్తా ఇవాళ హైదరాబాద్ రానున్నారు. ఎన్నికల నిర్వహణ, ఓటరు అవగాహన కార్యక్రమాలు, తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తారు.
అటు బూత్ స్థాయి అధికారులకు శిక్షణ విషయమై ఈసీ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గస్థాయి మాస్టర్ ట్రైనర్లతో సమావేశమైన ఈసీ సీనియర్ అధికారులు ఎన్నికలు సాఫీగా సాగేలా బీఎల్ఓల్లో నైపుణ్యం పెంచేలా శిక్షణ ఇవ్వాలని వారికి సూచించారు. ఎన్నికల నిర్వహణ, వ్యయ పర్యవేక్షణ ఇతర అంశాలపై ఇవాళ రాష్ట్ర అధికారులతో ఈసీ బృందం చర్చించనుంది.
Srinivasa Goud Election Affidavit Tampering Case : మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక కేసులో ఏం చేద్దాం.. దిల్లీలో ఈసీ మల్లగుల్లాలు