ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్. నియోజకవర్గంలోని కవాడిగూడలో పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
కవాడిగూడలో ఓటు నమోదు కార్యక్రమం - Mushirabad news
హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడలో ఓటు నమోదు కార్యక్రమం నిర్వహించారు. పట్టభద్రులంతా తమ ఓటును నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు.
కవాడిగూడలో ఓటు నమోదు కార్యక్రమం
పార్టీ శ్రేణులు డిగ్రీ పూర్తి చేసుకున్న వారి వద్దకు వెళ్లి పేర్లను నమోదు చేయించాలని కోరారు. నవంబర్ 6 వరకు పట్టభద్రులు తమ ఓటును నమోదు చేసుకోవచ్చని తెలిపారు.