ఓటుకు నోటుకు వ్యవహారంలో విచారణను సుప్రీంకోర్టు ఎల్లుండికి వాయిదా పడింది. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిటిషన్లపై ఎల్లుండి విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం వివరించింది. ఓటుకు నోటు కేసులో 25వ తేదీన విచారణ చేపడతామని జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేష్ మహేశ్వరి ధర్మాసనం పేర్కొంది.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే సండ్ర...
ఇప్పటికే ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విచారణ నిమిత్తం పలుమార్లు అనిశా ప్రత్యేక న్యాయస్థానానికి హాజరయ్యారు. రేవంత్‌తో పాటు నిందితులు సెబాస్టియన్, ఉదయ్ సింహా విచారణకు హాజరయ్యారు. కేసులో సాక్షిగా ఉన్న అసెంబ్లీ మాజీ కార్యదర్శి సదా రాజారాం వాంగ్మూలాన్ని న్యాయస్థానం నమోదు చేసింది.
సదా రాజారాం ఎమ్మెల్సీ ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించడంతో .. రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య అసెంబ్లీ ప్రసంగాల రికార్డులను అనిశాకు సమర్పించారు. పంచనామా సాక్షిగా ఉన్న ప్రధానోపాధ్యాయుడు రాజ్‌కుమార్ క్రాస్ ఎగ్జామిన్ పూర్తయింది. తదుపరి విచారణను న్యాయస్థానం సెప్టెంబరు 6కి వాయిదా వేసింది. సెప్టంబరు 6 నుంచి మిగతా సాక్షులందరి వాంగ్మూలాలు నమోదు చేసేలా న్యాయస్థానం షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఆ నేపథ్యంలోనే సండ్ర సుప్రీ కోర్టును ఆశ్రయించారు. సర్వోన్నత న్యాయస్థానం ఎల్లుండికి వాయిదా వేసింది.
ఇదీ చూడండి:HARISH RAO: 'భాజపా హయాంలో దేశం బంగ్లాదేశ్‌తో కూడా పోటీపడలేకపోతోంది'