ఓటుకు నోటు కేసులో అరెస్టయిన ఉదయ్‌సింహ బెయిల్ కోసం అనిశా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడు ఉదయ్‌సింహ విచారణకు గైర్హాజరు కావడం వల్ల... అనిశా కోర్టు మూడు రోజుల క్రితం నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
అనిశా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ఉదయ్‌సింహ - ఓటుకు నోటు కేసు తాజా వార్తలు
ఓటుకు నోటు కేసులో అరెస్టయిన నిందితుడు ఉదయ్‌సింహ.. అనిశా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఏసీబీ అధికారులను ఆదేశించింది.
అనిశా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ఉదయ్‌సింహ
కోర్టు ఉత్తర్వులపై ఏసీబీ అధికారులు ఉదయ్ సింహను బుధవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా... నిందితుడికి ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. అధికారులు నిందితుడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఇదీ చూడండి:ప్రజల సమాచారం ప్రభుత్వం సేకరిస్తే అంగీకరించం: హైకోర్టు