ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో వెల్లడించారు. గడిచిన ఆరేళ్లలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినట్లు చెప్పారు. రాబోయో రోజుల్లో జంట నగరాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. దీనికోసం ప్రతి ఒక్కరు డిసెంబర్ 1 న కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు.
'తెరాసకు ఓటేయండి... గ్రేటర్‌ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతాం' - కేటీఆర్ వార్తలు
ఆరేళ్లలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రాబోయో రోజుల్లో జంట నగరాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతామన్నారు. దీనికోసం ప్రతి ఒక్కరు డిసెంబర్ 1 న కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.

ktr
నగరంలో 24 గంటల విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరా, మెరుగైన ప్రజారవాణా, రహదారుల నిర్మాణం, డబుల్ డెడ్ రూమ్ ఇళ్లు, బస్తీ దవాఖానాలు, మెరుగైన పోలీసింగ్, అన్నపూర్ణ రూ.5 భోజనం, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి, అడవుల పెంపకం, ఫుట్ పాత్ల ఏర్పాటు, చారిత్రాత్మక కటట్టడాలకు పూర్వవైభవం తీసుకొచ్చిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి :ఆకర్షణీయ హామీలతో తెరాస జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో