హైదరాబాద్ అనిశా కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ కొనసాగుతోంది. స్టీఫెన్‌సన్ కుమార్తె సాక్ష్యం అవసరం లేదని కోర్టుకు అనిశా తెలిపింది. అమెరికాలో ఉన్న స్టీఫెన్‌సన్ కుమార్తె కరోనా వేళ రాలేరని అనిశా పేర్కొంది.
'ఓటుకు నోటు కేసులో స్టీఫెన్‌సన్ కుమార్తె సాక్ష్యం అవసరం లేదు'
ఓటుకు నోటు కేసులో స్టీఫెన్‌సన్ కుమార్తె సాక్ష్యం అవసరం లేదని కోర్టుకు అనిశా తెలిపింది. కరోనా వేళ అమెరికాలో ఉన్న స్టీఫెన్‌సన్ కుమార్తె వచ్చే అవకాశం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆమెను సాక్షిగా తొలగించేందుకు అనిశా న్యాయస్థానం ఒప్పుకుంది. తదుపరి విచారణ ఈనెల 10కి వాయిదా వేసింది.
'ఆ కేసులో స్టీఫెన్‌సన్ కుమార్తె సాక్ష్యం అవసరం లేదు'
స్టీఫెన్‌సన్ కుమార్తెను సాక్షిగా తొలగించేందుకు అనిశా కోర్టు అంగీకారం తెలిపింది. స్టీఫెన్‌సన్, మాల్కం టేలర్ క్రాస్ ఎగ్జామినేషన్ కోసం విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను ఈ నెల 10కి అనిశా కోర్టు వాయిదా వేసింది.
ఇదీ చూడండి:ఏటీఎం యంత్రం ధ్వంసానికి యత్నించిన దుండగుడు