గ్రేటర్ ఎన్నికల్లో ప్రగతిశీల, నిర్ణయాత్మక నాయకత్వాన్ని ఎన్నుకోవాలని నగరవాసులకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సూచించారు. ఒక ప్రగతిశీల ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఎటువంటి మేలు జరుగుతుందో వీడియో సందేశం ద్వారా కేటీఆర్ వివరించారు. బహుళజాతి సంస్థల గమ్యస్థానంగా, ప్రపంచంలోనే డైనమిక్ సిటీగా హైదరాబాద్ పరిఢవిల్లుతోందని మంత్రి చెప్పుకొచ్చారు.
ప్రగతిశీల, నిర్ణయాత్మక నాయకత్వాన్ని ఎన్నుకోవాలి : కేటీఆర్
బహుళజాతి సంస్థల గమ్యస్థానంగా... ప్రపంచంలోనే డైనమిక్ సిటీగా హైదరాబాద్ పరిఢవిల్లుతోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పెట్టుబడులు, ఉద్యోగాలు నగరానికి క్యూ కట్టాలన్నా.. నగరం విశ్వనగరంగా ఎదగాలన్నా ఒక డైనమిక్ గవర్నెన్స్ ఆవశ్యకతను గుర్తించాలన్నారు. అందుకే డిసెంబర్ 1న కారు గుర్తుకు ఓటేసి హైదరాబాద్ ప్రజల కొరకు ఆలోచించే తెరాసకు మద్దతు పలకాలని మంత్రి కోరారు.
ktr
పెట్టుబడులు, ఉద్యోగాలు నగరానికి క్యూ కట్టాలన్నా.. నగరం విశ్వనగరంగా ఎదగాలన్నా ఒక డైనమిక్ గవర్నెన్స్ ఆవశ్యకతను గుర్తించాలని కేటీఆర్ పేర్కొన్నారు. అందుకే డిసెంబర్ 1న కారు గుర్తుకు ఓటేసి హైదరాబాద్ ప్రజల కొరకు ఆలోచించే తెరాసకు మద్దతు పలకాలని మంత్రి అభ్యర్థించారు.
ఇదీ చదవండి :సగం ధరకే కొవిడ్ పరీక్ష.. గంటల వ్యవధిలో వైరస్ నిర్ధారణ