తెలంగాణ

telangana

ETV Bharat / state

శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం- 33 జిల్లాల్లో 49 కేంద్రాలు ఖరారు - తెలంగాణలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఈసీ ప్రకటన

Vote Counting Centers List in Telangana Assembly Elections : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఖరారయ్యాయి. 33 జిల్లాల్లో 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర అధికారులు పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది. దీంతో ఆయా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. రాజధాని హైదరాబాద్​లో ఎక్కువ సంఖ్యలో లెక్కింపు కేంద్రాలు ఉన్నాయి.

Telangana Assembly Elections 2023
Vote Counting Centers List in Telangana Assembly Elections

By ETV Bharat Telangana Team

Published : Nov 20, 2023, 10:28 PM IST

Vote Counting Centers List in Telangana Assembly Elections :శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఖరారయ్యాయి. 33 జిల్లాల్లో 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత అధికారులు పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం(CEC) ఆమోద ముద్ర వేసింది. దీంతో ఆయా కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. రాజధాని హైదరాబాద్​లో ఎక్కువ సంఖ్యలో లెక్కింపు కేంద్రాలు ఉన్నాయి.

రాష్ట్రంలో ప్రారంభమైన బ్యాలెట్ పత్రాల ముద్రణా ప్రక్రియ - 299 అదనపు పోలింగ్​ కేంద్రాలకు ఈసీ అనుమతి

జిల్లాలో 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల(Jubilee hills Constituency) లెక్కింపు చేపట్టనుండగా.. మిగిలిన 13 నియోజవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో నాలుగు లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మిగిలిన జిల్లాల్లో జిల్లాకు ఒకటి చొప్పున లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలు, నియోజకవర్గాల వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణ ఎన్నికల బరిలో 2297 మంది అభ్యర్థులు - సీఎం కేసీఆర్​పై 83 మంది పోటీ

క్రమ సంఖ్యజిల్లానియోజక వర్గంఓట్ల లెక్కింపు కేంద్రం
01 ఆసిఫాబాద్ సిర్పూర్ ఎస్సీ వెల్ఫేర్ గురుకుల కళాశాల, ఆసిఫాబాద్
02 మంచిర్యాల చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల అజీజియా ఇంజనీరింగ్ కళాశాల, మంచిర్యాల
03 ఆదిలాబాద్ ఆదిలాబాద్, బోథ్ టెక్నికల్ ట్రైనింగ్, డెవలప్మెంట్ సెంటర్, ఆదిలాబాద్
04 నిర్మల్ ఖానాపూర్, నిర్మల్, ముథోల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, నిర్మల్
05 నిజామాబాద్ ఆర్మూర్, బాన్స్ వాడ, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్, నిజామాబాద్
06 నిజామాబాద్ బోధన్ ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్, నిజామాబాద్
07 కామారెడ్డి జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి ఏఎంసీ గోడౌన్, కామారెడ్డి
08 జగిత్యాల కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి వీఆర్కే ఇంజనీరింగ్ కళాశాల, జగిత్యాల
09 పెద్దపల్లి రామగుండం, మంథని, పెద్దపల్లి జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల, మంథని
10 కరీంనగర్ కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, హుజూరాబాద్ ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ కళాశాల
11 సిరిసిల్ల వేములవాడ, సిరిసిల్ల ఎస్సీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల, సిరిసిల్ల
12 సంగారెడ్డి నారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్ చెరు గీతం యూనివర్సిటీ
13 మెదక్ మెదక్, నర్సాపూర్ వైపీఆర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, హవేలీఘనపూర్
14 సిద్దిపేట హుస్నాబాద్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ ఇందూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సిద్దిపేట
15 రంగారెడ్డి ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి సి.వి.ఆర్. ఇంజనీరింగ్ కళాశాల, ఇబ్రహీంపట్నం
16 ఎల్బీనగర్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం
17 రాజేంద్ర నగర్, చేవెళ్ల, షాద్ నగర్ లార్డ్స్ ఇంజనీరింగ్ కళాశాల, రాజేంద్రనగర్
18 శేరిలింగంపల్లి బాలయోగి స్టేడియం, గచ్చిబౌలి
19 వికారాబాద్ పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్ ఏఎంసీ గోడౌన్, పరిగి
20 మేడ్చల్ మల్కాజ్ గిరి మేడ్చల్, మల్కాజ్ గిరి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, ఉప్పల్ హోలీమేరి ఇంజనీరింగ్ కళాశాల, కీసర
21 హైదరాబాద్ ముషీరాబాద్ ఏవీ కళాశాల, దోమల్ గూడ
22 మలక్ పేట ఇండోర్ స్టేడియం, అంబర్ పేట
23 అంబర్ పేట రెడ్డి ఉమెన్స్ కళాశాల, నారాయణగూడ
24 ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం, యూసుఫ్ గూడ
25 సనత్ నగర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్, ఓయూ
26 నాంపల్లి జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్, మాసబ్ ట్యాంక్
27 కార్వాన్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మాసబ్ ట్యాంక్
28 గోషామహల్ తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, కోటి
29 చార్మినార్ కమలానెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల, నాంపల్లి
30 చాంద్రాయణగుట్ట నిజాం కళాశాల, బషీర్ బాగ్
31 యాకత్ పురా సరోజిని నాయుడు వనితా మహావిద్యాలయ, నాంపల్లి
32 బహదూర్ పురా అరోరా కళాశాల, బండ్లగూడ
33 సికింద్రాబాద్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్, ఓయూ
34 కంటోన్మెంట్ వెస్లీ కళాశాల, సికింద్రాబాద్
35 నారాయణపేట నారాయణపేట, మక్తల్ శ్రీదత్త బృందావన్ ఇనిస్టిట్యూట్, సింగారం
36 మహబూబ్ నగర్ మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర జయప్రకాశ్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల, మహబూబ్ నగర్
37 నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్ ఏఎంసీ గోడౌన్, నాగర్ కర్నూల్
38 వనపర్తి వనపర్తి ఏఎంసీ గోడౌన్, చిట్యాల
39 జోగులాంబ గద్వాల గద్వాల, అలంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్, గద్వాల
40 నల్గొండ దేవరకొండ, నాగార్జున్ సాగర్, మిర్యాలగూడ, నల్గొండ, మునుగోడు, నకిరేకల్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ గోడౌన్స్, దుప్పలపల్లి
41 సూర్యాపేట హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగుతుర్తి ఏఎంసీ గోడౌన్, సూర్యాపేట
42 యాదాద్రి భువనగిరి భువనగిరి, ఆలేరు ఆరోరా అకాడమీ, రాయిగిరి
43 జనగాం జనగాం, స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తి విద్యాభారతి ఇనిస్టిట్యూట్, పెంబర్తి
44 మహబూబాబాద్ డోర్నకల్, మహబూబాబాద్ ఎస్సీ బాలికల గురుకుల కళాశాల, మహబూబాబాద్
45 వరంగల్ నర్సంపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, వర్ధన్నపేట ఏఎంసీ గోడౌన్, ఎనుమాముల
46 జయ శంకర భూపాలపల్లి భూపాలపల్లి సీఈఆర్ క్లబ్, భూపాలపల్లి
47 ములుగు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం, ములుగు
48 భద్రాద్రి కొత్తగూడెం పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం అనుబోస్ ఇనిస్టిట్యూట్, పాల్వంచ
48 ఖమ్మం ఖమ్మం, పాలేరు, మధిర, వైరా, సత్తుపల్లి శ్రీచైతన్య కళాశాల, పొన్నేకల్

ABOUT THE AUTHOR

...view details