Vote Awareness Program in Telangana Assembly Election 2023 :తెలంగాణ ఎన్నికల్లో కీలక ఘట్టం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది.ప్రజా స్వామ్యంలో ఓటు అనేది చాలా విలువైనది. ఒక్క ఓటు తమ తల రాతలు మార్చడంతో పాటు భావితరాలకు దిశానిర్దేశం చేస్తుంది. మంచి నాయకుడిని ఎంచుకోవడం వల్ల మన భవిష్యత్ నిర్ణయిస్తుంది. ఇందులో భాగంగా ఎన్నికల వేళ ఓటర్లకు అవగాహన కల్పించేలా పలువురు నడుంబిగించారు.
Governor Tamilisai Awareness on Vote : ఈ నెల 30న పోలింగ్ నిర్వహించేందుకు ఇప్పటికే సర్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అర్హులైన ప్రతి ఒక్కరు తప్పక తమ ఓటు హక్కునువినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో ముఖ్య భూమిక పోషిస్తుందన్న గవర్నర్.. గురువారం ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
ఇట్స్ ఓటర్ టైం - శాసనసభ ఎన్నికల్లో అసలైన ఘట్టానికి రంగం సిద్ధం
"అర్హులైన ప్రతి ఒక్కరు తప్పక తమ ఓటు హక్కునువినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాను." - గవర్నర్ తమిళిసై సౌందర రాజన్
Ram Gopal Varma Awareness On Vote : హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో ప్రముఖ చిత్రకారుడు రమణరెడ్డి ఆర్ట్ ఫర్ డెమోక్రసీ కర్టూన్ చిత్రాలను సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ వీక్షించారు. ఈ సందర్భంగా ఓటర్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చిన ఆయన.. నిష్పక్షపాతంగా, నిజాయితీగా ఓటు వేసి మంచి పాలకుల్ని ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు.