Volunteer rapes girl: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో ఓ బాలికపై(15) గ్రామ వాలంటీర్ మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు ఉపాధి కోసం వేరే గ్రామంలో ఉంటున్నారు. అమ్మమ్మతో కలిసి బాలిక గ్రామంలో ఉంటోంది. వాలంటీర్‌గా పని చేస్తున్న వివాహితుడైన రావిపాటి కోటయ్య బాలికను బెదిరించి గత మూడు నెలలుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు.
Volunteer rapes girl: బాలికపై మూడు నెలలుగా గ్రామ వాలంటీర్ అత్యాచారం
Volunteer rapes girl: కొరిసపాడు మండలంలో బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన... ఆలస్యంగా వెలుగు చూసింది. బాలికను బెదిరించి... గ్రామ వాలంటీర్ గత మూడు నెలలుగా అఘాయిత్యానికి పాల్పడుతున్నాడని తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు... పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
Volunteer rapes girl
ఈ విషయాన్ని బాధిత బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలిని చికిత్స కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇవీ చదవండి: