తెలంగాణ

telangana

ETV Bharat / state

వీకే సింగ్​పై బదిలీ వేటు - police

తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్‌పై బదిలీ వేటు పడింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉన్నతాధికారులు ఆయనను ఆదేశించారు. పోలీస్ అకాడమీ సంచాలకులుగా.. పోలీసు రిక్రూట్‌మెంట్‌ ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.

vk singh transfer
వీకే సింగ్​పై బదిలీ వేటు

By

Published : Jun 28, 2020, 11:52 PM IST

రాష్ట్ర పోలీస్ అకాడమీ సంచాలకులు వీకే సింగ్​పై బదిలీ వేటు పడింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. పోలీస్ నియామక మండలి ఛైర్మన్ శ్రీనివాసరావుకు అకాడమీ సంచాలకులుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. స్వచ్ఛంద పదవీ విరమణ ఇవ్వాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శికి వీకే సింగ్ లేఖ రాసిన నాలుగు రోజుల్లోనే ఆయనను బదిలీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పోలీస్ శాఖలో ఎన్నో సంస్కరణలు తేవాలనే ధ్యేయంతో ఐపీఎస్ అయ్యానని కానీ సఫలం కాలేకపోయానని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వం తన సేవల పట్ల సంతృప్తిగా లేదని ప్రభుత్వానికి తాను భారం కావాలనుకోలేదని అందుకే అక్టోబర్ రెండో తేదీన స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతి ఇవ్వాలని హోంశాఖ కార్యదర్శిని కోరారు. పదోన్నతి విషయంలో వీకే సింగ్ కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు.

కొన్ని రోజుల క్రితం ఈ విషయంపై ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. అన్ని అర్హతలు ఉన్న తనకు పదోన్నతి కల్పించాలని ఆయన కోరారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. పదవీ విరమణ తర్వాత రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడానికి ప్రయత్నిస్తానని... అన్నా హజారే రీతిలో ప్రజలతో కలిసి పని చేస్తానని వీకే సింగ్ విడుదల చేసిన ఓ లేఖలో తెలిపారు. రాజకీయాలు, రాజకీయ నాయకుల వల్ల అభివృద్ధి సాధ్యం కాదని, కొంతమంది చేతుల్లో ప్రజలు కీలు బొమ్మలుగా మారారని వీకే సింగ్ అన్నారు. మహాత్మాగాంధీ, స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని ప్రజల్లో మార్పు తేవడానికి ప్రయత్నిస్తానని అన్నారు. పోలీస్ శాఖలో ఉన్నత హోదాలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం వీకే సింగ్​పై వెంటనే బదిలీ వేటు వేసింది.

ఇవీ చూడండి: రాష్ట్ర పోలీస్‌ అకాడమీలో 180 మందికి కరోనా పాటిజివ్‌

ABOUT THE AUTHOR

...view details