ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం నేత పల్లా శ్రీనివాసరావు చేపట్టిన నిరాహారదీక్షను.. గత రాత్రి పోలీసులు భగ్నం చేశారు. శ్రీనివాస్‌ను దీక్షా శిబిరం నుంచి బలవంతంగా కృషి ఐకాన్ ఆస్పత్రికి తరలించారు.
తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు దీక్ష భగ్నం - విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వార్తలు
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెదేపా నేత పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. శ్రీనివాసరావును దీక్ష శిబిరం నుంచి కృషి ఐకాన్ ఆసుపత్రికి బలవంతంగా తరలించారు.
పల్లా దీక్షకు సంఘీభావం ప్రకటించేందుకు ఇవాళ తెలుగుదేశం అధినేత చంద్రబాబు విశాఖకు రానుండగా ఆ పర్యటనకు కొద్ది గంటల ముందే పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు.
మొదట సాధారణ నిరాహార దీక్షకు కూర్చున్న పల్లా శ్రీనివాస్.. వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం అనంతరం.. నిర్ణయం మార్చుకొని ఆమరణ దీక్షకు దిగారు. ఫిబ్రవరి 10 నుంచి ఈ దీక్ష కొనసాగుతోంది. అటు.. పల్లా దీక్షకు మద్దతు తెలిపేందుకు నిన్న విశాఖకు వచ్చిన అమరావతి రైతులు.. రాత్రి ఒంటి గంట వరకూ దీక్షా శిబిరం వద్దే ఉన్నారు. జై అమరావతి- విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు కూడా చేశారు.