ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఎల్‌జీ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకైన కారణంగా వందల మంది అనారోగ్యానికి గురయ్యారు. ఈ గ్యాస్ పీల్చిన వెంటనే మెదడుపై ప్రభావం చూపిస్తుందని.. అందుకే ఇది ప్రమాదకరమని నిపుణులు వెల్లడించారు. ప్రమాద స్థలానికి సమీప ప్రాంతాల్లోని ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి వైజాగ్ కొవిడ్-19 వాలంటీర్స్.. కొన్ని ప్రాథమిక సూచనలు చేశారు.
* నీటిని అధికంగా తీసుకోవాలి.
* తప్పనిసరిగా తడి మాస్కు ధరించాలి. ఇంటిదగ్గర ఉన్నా సరే మాస్కు వేసుకోవాలి.
* కళ్లు మంటగా అనిపిస్తే వెంటనే కంటి చుక్కలు వేసుకోవాలి.
* ఇబ్బందిగా అనిపిస్తే సిట్రిజన్ మందును వాడాలి (డాక్టరు సలహా మేరకు మాత్రమే).