తెలంగాణ

telangana

ETV Bharat / state

విశాఖ గీతం వర్సిటీకి చెందిన నిర్మాణాలు కూల్చివేత - geetham university latest news

విశాఖ గీతం వర్సిటీకి చెందిన కొన్నికట్టడాలు కూల్చివేత
విశాఖ గీతం వర్సిటీకి చెందిన కొన్నికట్టడాలు కూల్చివేత

By

Published : Oct 24, 2020, 6:09 AM IST

Updated : Oct 24, 2020, 10:24 AM IST

06:06 October 24

విశాఖ గీతం వర్సిటీకి చెందిన నిర్మాణాలు కూల్చివేత

విశాఖ గీతం వర్సిటీకి చెందిన నిర్మాణాలు కూల్చివేసిన రెవెన్యూ సిబ్బంది

  ప్రభుత్వ భూములు ఆక్రమించి నిర్మించారనంటూ ఏపీ విశాఖ గీతం విశ్వవిద్యాలయంలోని కొన్ని కట్టడాలను రెవెన్యూ అధికారులు తొలగిస్తున్నారు. విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం, ప్రహరీ గోడ కొంతభాగం, సెక్యూరిటీ గదులను కూల్చివేశారు. అధికారులు జేసీబీ, బుల్‌డోజర్లతో కూల్చివేత చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు. నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని గీతం యాజమాన్యం ఆరోపిస్తోంది. అసలు ఎందుకు కూల్చుతుందో  చెప్పడం లేదని యాజమాన్యం అంటోంది. గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత నేపథ్యంలో బీచ్‌ రోడ్డు మీదుగా గీతం విశ్వవిద్యాలయానికి వెళ్లే మార్గాన్ని అధికారులు రెండువైపులా మూసివేశారు. కూల్చివేత సమాచారం తెలిసి తెదేపా శ్రేణులు వర్సిటీ వద్దకు చేరుకున్నాయి.

ముందస్తు సమాచారం లేకుండానే..

  తెల్లవారుజామునే తమకు సమాచారం వచ్చిందని వర్సిటీ సిబ్బంది తెలిపారు. వర్సిటీకి వచ్చేలోపే ఎవరినీ లోపలికి అనుమతించలేదని చెప్పారు. సెక్యూరిటీ సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్నామన్నారు. ముందస్తు సమాచారం లేకుండా చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మార్కింగ్‌ ముందే చేశారనడం అవాస్తవమని, ఇప్పుడు చేస్తున్నారని పేర్కొన్నారు. న్యాయపరమైన అంశాలన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయని తెలిపారు. 

 

ఇదీ చదవండి:గోదావరి ట్రైబ్యునల్ ఏర్పాటుకు ఉభయ రాష్ట్రాల అంగీకారం

Last Updated : Oct 24, 2020, 10:24 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details