ఏపీలోని విశాఖ మన్యంలో శీతాకాలం శోభ సంతరించుకుంది. దట్టమైన పొగమంచు వ్యాపించి చూపరులను కట్టిపడేస్తోంది. వంజంగి కొండలు పర్యటకులతో కిటకిటలాడుతున్నాయి. వేకువ జాము నుంచి మన్యంలో చలి గాలులు మొదలయ్యాయి.
వంజంగి కొండల్లో పర్యాటకుల సందడి - విశాఖ మన్యం వంజంగి కొండలు
విశాఖ మన్యంలో శీతాకాలం శోభ సంతరించుకుంది. పర్యటక ప్రాంతమైన వంజంగి కొండలు పర్యటకులతో కిటకిటలాడుతున్నాయి. గిరిజన బాలికల థింసా నృత్యం ఆకట్టుకుంటోంది.
వంజంగి కొండల్లో పర్యాటకుల సందడి
పాడేరుకు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంజంగి కొండల మీదకు పర్యాటకులు అతి కష్టం మీద గంట ప్రయాణం చేసి చేరుకుంటున్నారు. ప్రకృతి రమణీయ దృశ్యాలను ఆస్వాదిస్తూ ఆహ్లాదం పొందుతున్నారు. పరిసర గ్రామాలైన ఎస్.కొత్తూరు, కల్లాల బయలులో గిరిజన బాలికల థింసా నృత్యం పర్యటకులను మరింత ఆకట్టుకుంటోంది.