సమాజంలో యువత తమ వ్యక్తిత్వాన్ని పరిరక్షించుకోవడంతో పాటు దుష్టశక్తుల నుంచి అప్రమత్తంగా ఉండాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు సూచించారు. హైదరాబాద్ దోమలగూడలోని రామకృష్ణ మఠంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
స్వామి వివేకానంద హైదరాబాద్కు వచ్చిన విశేషాల ప్రత్యేక డాక్యుమెంటరీ సంచికను విద్యాసాగర్ రావు ఆవిష్కరించారు. యువత వ్యక్తిత్వం విషయంలో తమదైన శైలిని నిరూపించుకుని అన్ని రంగాల్లో ఎదగాలని ఆయన పేర్కొన్నారు. సింహాల్లా గర్జించాల్సిన యువత స్మార్ట్ ఫోన్లను పట్టుకుని తప్పుదోవ పడుతున్నదని ఆయన అన్నారు.