తెలంగాణ

telangana

ETV Bharat / state

కళాతపస్వి కన్నుమూత.. స్వగ్రామంలో ఆయన గురించి ఏమంటున్నారంటే..! - విశ్వనాథ్ స్వగ్రామం ఏది

Viswanath Native Village: కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతితో ఆయన స్వగ్రామం ఏపీలోని బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివర్రులో విషాద ఛాయలు అలుముకున్నాయి. విశ్వనాథ్ గ్రామానికి ఎంతో చేశారని.. ఎక్కడికి వెళ్లినా ఆయన పేరు చెప్పుకుంటామని గ్రామస్థులు తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.

కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత
కళాతపస్వి విశ్వనాథ్ కన్నుమూత

By

Published : Feb 3, 2023, 3:35 PM IST

విశ్వనాథ్‌ స్వగ్రామంలో ఆయన గురించి ఏమంటున్నారంటే

Viswanath Native Village: ప్రముఖ దర్శకులు కె.విశ్వనాథ్ మృతితో ఆయన స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పెదపులివర్రులో విషాద ఛాయలు అలుముకున్నాయి. కె.విశ్వనాథ్ పదేళ్ల వయసు వచ్చే వరకూ వారి కుటుంబం పెదపులివర్రులో నివాసం ఉండేది. ఆ తరువాత వారి కుటుంబం విజయవాడ వెళ్లిపోయిందని ఆయన స్నేహితులు తెలిపారు. విజయవాడలో విశ్వనాథ్ తండ్రి సినిమా థియేటర్ మేనేజర్​గా పని చేసేవారు. విశ్వనాథ్ ఉన్నత చదువులు విజయవాడలోనే సాగాయి. తర్వాత విశ్వనాథ్ తండ్రికి బి.ఎన్‌ రెడ్డితో పరిచయం ఏర్పడటంతో సినిమా ఫీల్డ్​కు పంపించారన్నారు.

విశ్వనాథ్‌-తాను చిన్నప్పుడు బాగా స్నేహంగా ఉండేవాళ్లమని గ్రామానికి చెందిన సుబ్బారావు తెలిపారు. విశ్వనాథ్ నివసించిన ఇంటిని ఆ తర్వాత కాలంలో సజ్జ బసవపున్నయ్య కొనుక్కున్నారు. ఆ ఇల్లు కొనుక్కున్నాక ఆయనకు బాగా కలిసి వచ్చిందన్నారు. విశ్వనాథ్ మృతికి విచారం వ్యక్తం చేశారు. దర్శకుడిగా మారిన తర్వాత కొన్నిసార్లు పెదపులివర్రు వచ్చారన్నారు. ప్రస్తుతం విశ్వనాథ్ కుటుంబానికి సంబంధించిన వారు ఎవరూ గ్రామంలో లేరు.

"వాళ్ల పొలాలన్నీ మా తాత గారే పండించి వ్యవసాయం చేసేవారు. ఈ ఇల్లు కొన్న తరువాత నాకు ఉద్యోగం వచ్చింది. ఆయన దయ వల్ల మాకు బాగా కలసొచ్చింది."- సజ్జ బసవపున్నయ్య, గ్రామస్థుడు

"నేను, విశ్వనాథ్ పదో సంవత్సరం వరకూ కలిసే ఉండేవాళ్లం. కలిసి ఆడుకునేవాళ్లం. తరువాత వారి కుటుంబం విజయవాడ వెళ్లిపోయింది. తరువాత సినిమా ఫీల్ట్​లోకి వెళ్లారు". - సుబ్బారావు, విశ్వనాథ్ స్నేహితుడు

ఇవీ చదవండి:

కె.విశ్వనాథ్​కు చిత్రసీమ నివాళి.. అప్పటివరకు షూటింగ్స్​ బంద్​

ఐదు నెలల్లో ఐదుగురు దిగ్గజాలు.. టాలీవుడ్​ను వెంటాడుతున్న విషాదాలు

ABOUT THE AUTHOR

...view details